విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలి : ఎస్పీ అశోక్ కుమార్

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే జిల్లాకు మంచి పేరు

Update: 2024-09-25 15:12 GMT

దిశ, జగిత్యాల టౌన్: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాకు కేటాయించబడిన ట్రైనీ ఎస్ఐ లతో సమావేశమై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ డిపార్ట్మెంట్ అని, అలాంటి శాఖలో నియమితులందరూ క్రమశిక్షణతో మెలగాలని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

అలాగే వివిధ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అన్ని రకాల డ్యూటీలను తెలుసుకోవాలని, అన్ని శాఖలకు చెందిన అధికారులతో తస్సంబంధాలు కలిగి ఉండి శాంతి భద్రత దృష్ట్యా ముందుండాలని సూచించారు. అనంతరం పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగిందని, సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తుల్లో మెలకువలు నేర్చుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందని అన్నారు. అలాగే జాతీయ స్థాయిలో జరిగే పోలీసు డ్యూటీ మీట్ విజేతలకు మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, రంగారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


Similar News