కమిషనరేట్ స్థాయిలో పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు : కరీంనగర్ సీపీ

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో పనిచేస్తున్న పోలీస్

Update: 2024-09-25 15:37 GMT

దిశ, కరీంనగర్: కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి బుధవారం వివిధ విభాగాల్లో కమిషనరేట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ ఎంపిక కొరకు కమీషనరేట్లు, జిల్లాల వారీగా ఈ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ముఖ్యంగా ఫోరెన్సిక్ సైన్స్ , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు చట్టాలు , మెడికో లీగల్ టెస్ట్ , ఫింగర్ ప్రింట్ సైన్స్ , క్రైమ్ సీన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, క్రైమ్ సీన్ పరిశీలన , చెకింగ్ లో భాగంగా వాహనాల చెకింగ్ , గ్రౌండ్ తనిఖీ , రూమ్ తనిఖీ , యాక్సిస్ కంట్రోల్ లో నైపుణ్యత, కంప్యూటర్ పై అవగాహన, డాగ్ స్క్వాడ్ లో ట్రాకింగ్ , ఎక్సప్లోజివ్, నార్కోటిక్ విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి జోనల్ స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో మరల పోటీలు నిర్వహించి ఎంపికలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపిక అయిన వారికి శిక్షణ అనంతరం ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు. ఈ డ్యూటీ మీట్ పోటీల్లో కమిషనరేట్ లోని అన్ని విభాగాలు,డివిజన్ ల నుంచి అధికారులు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.


Similar News