చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివి : MLC పాడి కౌశిక్ రెడ్డి
దిశ, హుజూరాబాద్ రూరల్: వీరనారి చిట్యాల, చాకలి ఐలమ్మ సేవలు మరువలేని అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని ఐలమ్మ చౌక్ వద్ద
దిశ, హుజూరాబాద్ రూరల్: వీరనారి చిట్యాల, చాకలి ఐలమ్మ సేవలు మరువలేని అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని ఐలమ్మ చౌక్ వద్ద హుజురాబాద్ రజక సంఘం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం ఐలమ్మ 37వ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భూమి కోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ తెలంగాణలో నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేశారని కొనియాడారు. ఆనాడు రజకులు గ్రామీణ ప్రాంతంలో భూస్వాములకు ఉచితంగా వెట్టిచాకిరి చేసే వారిని వెట్టిచాకిరి చేయకపోతే రజకుల పైన దౌర్జన్యాలు చేసావారని వాటిని కళ్లారా చూసిన ఐలమ్మ వెట్టి చాకిరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి విముక్తి కల్పించిన ఘనత వీరనారి అయిలమ్మ దేనని కొనియాడారు.
ఐలమ్మ పోరాట ఫలితంగానే తెలంగాణలో భూసంస్కరణలు జరిగాయని గుర్తు చేశారు. ఐలమ్మను యువతి, యువకులు, మహిళలు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కలిపాక నిర్మల, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లిపాక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు నిమ్మటూరి సాయి కృష్ణ, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, కళ్ళపల్లి రమాదేవి, ఓసి జేఏసీ నాయకుడు పోలాడి రామారావు, రజక సంఘం నాయకులు కొలిపాక శంకర్ నల్ల బాలరాజు రవి సదానందం కే రవి, రాజమౌళి, గోపు వెంకటేశ్వర్లు ప్రజా సంఘాల
Also Read : ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలి: ఈటల