బస్టాప్‌లోకి లారీ.. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ దుర్మరణం
సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సమీపంలోని నారాయణపూర్ ఎక్స్ రోడ్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ యాక్సిడెంట్ చోటు చేసుకుంది.
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సమీపంలోని నారాయణపూర్ ఎక్స్ రోడ్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తున్న చిన్న కల్వలకు చెందిన ఒక మహిళ మృతి చెందినట్లుగా గుర్తించారు. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుగా వెళ్తున్న ఎరువుల లారీ అతివేగంతో వచ్చింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా లారీకి అడ్డు వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అదే సమయంలో అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్నమహిళ పై పడింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ చిన్నకల్వల గ్రామానికి చెందిన కలువల ఈశ్వరమ్మగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.