రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంభిస్తూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, కోరుట్ల: రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంభిస్తూ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ అధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ కుటుంబాలు దేశం కోసం చేసినా అత్యున్నత త్యాగాలకు వారసత్వం అయినా రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
దేశం మొత్తం సంపదను దోచుకుని ఒకరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కేంద్రం కట్టబెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకటి అమ్మేస్తున్నారని, ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రజాస్వామ్యన్ని పాతరెస్తున్నారని మండిపడ్డారు. నియంత తరహాలో అణచి వేసే ప్రయత్నమే రాహుల్ గాంధీ ఎంపీ పదవి మీద వేసిన అనర్హత వేటు అని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం మరియు కేంద్ర మంత్రి వర్గం అంతా కలిసి అదానీ మరియు బీజేపీ మోదీ మధ్యలో గల ఆర్థిక సంబంధాల్ని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆలోచనా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, కొంతం రాజాం, అంజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సత్యనారాయణ, అల్లూరి మహేందర్ రెడ్డి, గంగనర్సయ్య, పోతుగంటి శంకర్, ఏలేటి మహిపాల్ రెడ్డి మల్లయ్య, నిర్మల, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.