హుజురాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం : MLC Padi Kaushik Reddy

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

Update: 2023-07-17 14:43 GMT

దిశ, జమ్మికుంట : త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నిరసిస్తూ మూడు గంటల కరెంటు కావాలా.. మూడు పంటలు కావాలా.. అని రైతులను ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్టశక్తులు ఎన్ని వచ్చినా రైతులను కాపాడే ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తనకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పావని, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిళి రమేష్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రీరాములపల్లి, గడ్డివానిపల్లి, రేకుర్తి, చిన్న కోమటిపల్లి గ్రామాల రైతులు, తదతరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News