BREAKING: కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

ఇళ్ల యజమానులు, అధికారుల నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున్న అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

Update: 2024-07-02 02:08 GMT

దిశ, వెబ్‌డెస్క్/కరీంనగర్: ఇళ్ల యజమానులు, అధికారుల నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నా అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా, సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కరీంనగర్ పట్టణంలోని బస్టాండ్ కాంప్లెక్స్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి అర్ధరాత్రి బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకులో సైరన్ల శబ్ధం విన్న స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం నుంచి బ్యాంకు లోపలికి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో కిటికీ అద్దాలను ధ్వంసం చేసి మరి బ్యాంకులో లోపలికి వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దాదాపు 3 గంటల పాటు ఫైర్ సిబ్బంది కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణమని, ఆస్తి నష్టం జరిగిందని బ్యాంకు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.

Similar News