గట్టి పోటీనిచ్చిన BJP.. చతికిలపడ్డ కాంగ్రెస్.. ''సెస్'' ఎన్నికల్లో సీన్ రివర్స్!

రాజన్నసిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాష్ ఔట్ అయ్యింది. సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) ఎన్నికల్లో ఒక్క డైరెక్టర్ స్థానం కూడా గెలవలేని పరిస్థితి నెలకొంది.

Update: 2022-12-26 12:17 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాష్ ఔట్ అయ్యింది. సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) ఎన్నికల్లో ఒక్క డైరెక్టర్ స్థానం కూడా గెలవలేని పరిస్థితి నెలకొంది. కోనరావుపేట, వేములవాడ అర్బన్ మండలంలో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ జారవిడుచుకుంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక బద్దంగా సెస్ ఎన్నికల్లో ముందుకు వెళ్లలేకపోయింది. ఇదిలా ఉంటే.. బీజేపీ పార్టీ అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించి.. చివరి వరకు పోరాడి ఓడారు. అయిన బీజేపీ అధిష్టానం, జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి.

సెస్ ఎన్నికలను మొదటి నుంచి బీజేపీ నేతలు నిర్లక్ష్యంగానే తీసుకున్నారు. అభ్యర్థుల లిస్ట్ ను కూడా నామీనేషన్లు చివరి రోజు వరకు కూడా ప్రకటించలేదు. గ్రూపు రాజకీయాలతో ఒక్కో మండలంలో ముగ్గురేసి అభ్యర్థులు నామీనేషన్లు వేశారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల టౌన్1, చందుర్తి, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనరావుపేట మండల సెస్ డైరక్టర్ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్ననప్పటికి బీజేపి గ్రౌండ్ వర్క్ సరిగా చేయలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మాత్రం బీజేపికి ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పాలి. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గట్టి పోటినిచ్చారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇబ్బందికర పరిస్థితుల్లో పడిపోయింది.

సిరిసిల్ల టౌన్ 1 లో బీఆర్ఎస్ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించిన బీజేపీ

మంత్రి కేటీఆర్ ఇలాకా అయిన సిరిసిల్ల టౌన్ 1లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దిడ్డి రమాదేవికి బీజేపి అభ్యర్థి మోర శైలజ ముచ్చెమటలు పట్టించారు. మొదటి మూడు రౌండ్లు వరుసగా లీడ్‌లో కొనసాగి బీఆర్ఎస్ నేతలను పరేషాన్ చేశారు. ఒక దశలో ఈ డైరెక్టర్ స్థానం వదులకున్నంత పని చేశారు బీఆర్ఎస్ లీడర్లు. దీంతో వీలీన గ్రామాల ఓటర్లు బీఆర్ఎస్‌కు వ్యతిరేఖంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది. సిరిసిల్ల పట్టణంలో ఓట్ల లెక్కింగా ప్రారంభం కాగానే బీజేపీని వెనక్కి నెట్టి బీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి రమాదేవి లీడింగ్‌లోకి వచ్చారు

ఇవి కూడా చదవండి : సెస్ ఎన్నికల రీ కౌంటింగ్.. Bandi Sanjay రియాక్షన్ ఇదే!

Tags:    

Similar News