శంకరపట్నంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తలిగింది.
దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తలిగింది. మండలంలో లిక్కర్ వ్యాపారాన్ని శాసించే గాజుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన లిక్కర్ వ్యాపారి గాజుల శ్రీనివాస్ గతంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అనుచరుడుగా చలామణి అయ్యారు.
కాగా మానకొండూర్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మొలంగూర్ గ్రామంలో కాంగ్రెస్ విజయభేరి ఎన్నికల ప్రచారంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శంకరపట్నం మండలంలో శ్రీనివాస్ చేరికతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.