దేశానికి ఆస్తి బాబు జగ్జీవన్ రామ్, బాబా సాహెబ్ అంబేద్కర్: మంత్రి గంగుల కమలాకర్

బాబు జగ్జీవన్ రామ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఇద్దరూ దేశానికి ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Update: 2023-04-05 13:34 GMT

దిశ, కరీంనగర్: బాబు జగ్జీవన్ రామ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఇద్దరూ దేశానికి ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశంలో అట్టడుగు వర్గంలో పుట్టి ఆణిముత్యంలా వెలిసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.

భారతదేశం పవిత్ర భూమి అని ఎప్రిల్ మాసంలో బాబూ జగ్జీవన్ రామ్, బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే లాంటి మహనీయులు జన్మించారని తెలిపారు. ఎక్కడో బీహార్ లో పుట్టిన మహానీయుడైన జగ్జీవన్ రాం జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు. మహానీయుల ఆశయాలను భావి తరాలకు తెలియజేసేలాలా ప్రతి ఒక్కరూ చోరవ చూపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో దళితులు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్ ర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీ.వీ.రామకృష్ణారావు మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్, సీపీ సుబ్బారాయుడు, దళిత నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News