రైతు దినోత్సవంలో రసాభాస
రాష్ట్ర అవతరణ దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రైతు దినోత్సవం సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రైతు బుర్ర కుమారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్సీ,.. రైతుకు మధ్య వాగ్వాదం
దిశ, జమ్మికుంట : రాష్ట్ర అవతరణ దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రైతు దినోత్సవం సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రైతు బుర్ర కుమారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట రైత వేదిక వద్ద సమావేశం నిర్వహిస్తుండగా, సమావేశంలో ఎమ్మెల్సీ పాడ్ కౌశిక్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. అదే గ్రామానికి చెందిన బుర్ర కుమార్ అనే రైతు ఇప్పటివరకు రైతు రుణమాఫీ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.
అకాల వర్షాలకు పంట నష్టం జరిగినా.. రైతులకు ఎందుకు నష్ట పరిహారం ఇవ్వడం లేదని అనండంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సదరు రైతును ఉద్దేశించి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉందని, రైతుబంధు తీసుకుంటున్నావా.. లేదా అని, సిగ్గూ.. శరం ఉందా అంటూ రైతుపై ఎదురుదాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం అప్పటికి సద్దుమణిగింది.