Adluri Laxman : నిజాం నిరంకుశ పాలనకు సెప్టెంబర్ 17తో విముక్తి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినోత్సవం గా భావించి

Update: 2024-09-17 14:48 GMT

దిశ,వెల్గటూర్ : సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినోత్సవం గా భావించి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి గుర్తింపుగా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రాన్ని పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటే దాదాపుగా రెండేళ్ల వరకు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం లభించక పోవడం ఇక్కడి వారంతా నిజాం బానిసలు గా బతకడం మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంతం నిజాం కబంధ హస్తాల్లో నలిగిపోతున్న వేల ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గా పిలిచే లాల్ బహదూర్ శాస్త్రి, ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో సైనిక చర్య చేపట్టి నిజాం మెడలు వంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించారన్నారు.

ఇంత గొప్ప దినాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం గొప్ప విషయమని అన్నారు.ఈ సందర్భంగా ధర్మపురి లోని క్యాంపు కార్యాలయంలో నా చేతుల మీదుగా జాతీయ పతా కాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని,నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉద్యమం చేసి ఎంతో మంది వీరులు ప్రాణాలను కోల్పోవడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా సెప్టెంబర్ 17 ను ప్రజా పాలన దినోత్సవం గా జరుపు తుందన్నారు .అదే విధంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను సైతం అమలు చేయడం జరుగు తుందని,ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా రేషన్ కార్డులను జారీ చేస్తామని, వాటి పైన సన్న బియ్యం పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Similar News