పక్కాప్రణాళికతో అభివృద్ధి పాలన : ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో బీఆర్ఎస్ పక్కాప్రణాళికతో తెలంగాణ అభివృద్ధి కై పాలన సాగిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Update: 2023-11-25 11:30 GMT

దిశ, కోరుట్ల టౌన్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పక్కాప్రణాళికతో తెలంగాణ అభివృద్ధి కై పాలన సాగిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కు మద్దతుగా కవిత పట్టణంలోని పలువార్డులలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుంటే ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. అందుకే కేసీఆర్ మూడోసారి సీఎం కాకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి ఫలాలను పొందిన ప్రజలు అండగా ఉండగా కేసీఆర్ మూడోసారి సీఎం కావడం నల్లేరు పై నడకే అవుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మరోసారి విజయఢంకా మోగిస్తుందని, కోరుట్లలో కూడా సంజయ్ కు భారీ మెజారిటీ అందించాలని ఆమె కోరారు.

పనిచేసే ప్రభుత్వాన్ని పక్కనబెట్టాలనడం కొన్ని రాజకీయ పార్టీలు అవివేకానికి నిదర్శనం అని ప్రజలు సదా బీఆర్ఎస్ కు అండగా నిలుస్తారన్నారు. ఈ ఎన్నికల్లో కోరుట్లలో సంజయ్ గెలుపు కోసం ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ప్రతికుటుంబం పనిచేయాలని అభ్యర్థించారు. అన్ని రంగాల్లో ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని సంజయ్ ప్రజలకు వినతి చేశారు. తాను గెలిస్తే కోరుట్లలో మరిన్ని అభివృద్ధి పనులకు ఆస్కారం ఉంటుందని, అందుకే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, కౌన్సిలర్లు జిందం లక్ష్మి నారాయణ, పోగుల ఉమా రాణి, నాయకులు పుప్పాల ప్రభాకర్, పాల్గొన్నారు.

Tags:    

Similar News