Lower Manair Dam | Karimnagar :ఎల్ఎండికి క్రమంగా పెరుగుతున్న వరద

తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జలా శయం లో క్రమంగా నీటి వరద ఉదృతి పెరుగుతుంది. గంట, గంటకు ప్రాజెక్ట్ లోకి వచ్చే వరద ఉదృతి పెరుగుతుండడం తో ఎస్సార్ఎస్పీ అధికారులు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు

Update: 2023-07-27 04:04 GMT

దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి జలా శయం లో క్రమంగా నీటి వరద ఉదృతి పెరుగుతుంది. గంట, గంటకు ప్రాజెక్ట్ లోకి వచ్చే వరద ఉదృతి పెరుగుతుండడం తో ఎస్సార్ఎస్పీ అధికారులు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్ట్ లోకి వరద ఉదృతి పెరుగుతూ ఉంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు 6 వెల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా గంట,గంటకు పెరుగుతూ గురువారం ఉదయం 8 గంటలకు 54,000 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం 20 టీఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తుంది. మరో 4 టీఎంసి ల నీరు వచ్చి చేరితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో నిండే పరిస్థితి ఉంటుంది. వరద ఉదృతి ఇలాగే కొనసాగితే మరి కొన్ని గంటల్లోనే ఎల్ఎండి గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉందని తెలుస్తుంది. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏ క్షణం లో అయినా గేట్లు ఎత్తే పరిస్థితి ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు, నది పరివాహక ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ సర్కిల్ -2 ఎస్ఈ శివకుమార్ సూచనలు జారీ చేశారు.

Tags:    

Similar News