ప్రకృతితో మమేకం.. గణపయ్య సందేశం..ఆలోచింపజేస్తున్న గ్రీన్ హోప్ యూత్

పట్టణంలోని గ్రీన్ హోప్ యూత్ నిర్వాహకులు గణేశ్ ఉత్సవాలతో

Update: 2024-09-09 13:22 GMT

దిశ, కోరుట్ల రూరల్: పట్టణంలోని గ్రీన్ హోప్ యూత్ నిర్వాహకులు గణేశ్ ఉత్సవాలతో ఘనమైన సందేశం అందిస్తున్నారు. మనకు అమ్మ లాంటి ప్రకృతి పరిరక్షణ కోసం ప్రచారం చేస్తూ గణేష్ ప్రతిమలను ప్రకృతితో మమేకం చేస్తున్నారు. ప్రకృతిహితమైన విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజెప్పుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2003 నుండి గణేష్ విగ్రహాలు ప్రతిష్టిస్తూ ముందుకు సాగుతున్న గ్రీన్ హోప్ 2013 నుండి పర్యావరణ హితమైన విధానంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 2013 లో ఇసుక గణపతి తయారీతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతియేటా ప్రత్యేక గణేష్ ప్రతిమలతో పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా చెట్టు బెరడుతో గణపతి ప్రతిమను రూపొందించి ఔరా అనిపించారు. ఈ గణపతిని చూసేందుకు జనం సైతం ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణానికి మూలం అయిన చెట్టు దేవునితో సమానం అనే సందేశాన్ని అందిస్తున్న గ్రీన్ హోప్ గణపతి కోరుట్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

గ్రీన్ హోప్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు తయారు చేసిన గణేష్ ప్రతిమలు - 2013 - ఇసుక గణపతి, 2014 -కుందన్స్ గణపతి, 2015 - కట్టె గణపతి, 2016 – అర్ధనారీశ్వర (మట్టి) గణపతి, 2017 - బొగ్గు గణపతి, 2018 - దూది గణపతి, 2019 - రుద్రాక్ష గణపతి, 2020 – నెమలి పింఛాల గణపతి, 2021 - ముత్యాల గణపతి, 2022 - రంగు రాళ్ళ గణపతి, 2023 - అద్దాల గణపతి, 2024 - చెట్టు బెరడు గణపతి.


Similar News