అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు.. మానవత్వం చాటుకున్న కేటీఆర్

రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు నెలలుగా ఉపాధి లేకపోవడంతో లక్ష్మీనారాయణ అనే చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-04-06 12:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు నెలలుగా ఉపాధి లేకపోవడంతో లక్ష్మీనారాయణ అనే చేనేత కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో చోటు చేసుకుంది. తన సొంత ఇలాకాలో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడి కేటీఆర్ వాళ్లకు ధైర్యం చెప్పారు. అనంతరం మృతుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహయం చేసి మానవత్వం చేసుకున్నారు. ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మీనారాయణ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


Similar News