రోడ్డెక్కిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

Update: 2024-08-15 10:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ మెస్ లో విద్యార్థులకు ఆహారం అందించడం లేదంటూ యూనివర్సిటీ చౌరస్తా రోడ్డులో ధర్నాకు దిగారు. విద్యార్థులకు సరిపడినంత ఆహార పదార్థాలు వండటం లేదన్న విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు ఆకలితో ఉంటున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ మెస్ లో నిర్వహణ సరిగా ఉండటం లేదని, చాలా తక్కువగా ఆహారం వండి, మిగిలిన సరుకులను బయటకు తరలిస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు హాస్టల్ నిర్వాహకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు వాపోయారు. ఇదిలా ఉండగా.. తాము బోర్డింగ్ విద్యార్థుల లెక్క ప్రకారమే వంటలు సిద్దం చేస్తున్నామని, నాన్ బోర్డింగ్ విద్యార్థులు కూడా వచ్చి తినడం వల్ల ఆహారం అయిపోతుందని అన్నారు. నాన్ బోర్డింగ్ విద్యార్థులను వద్దని వారిస్తే తమ మీద దౌర్జన్యానికి దిగుతున్నారని మెస్ సిబ్బంది చెప్పుకొచ్చారు.  


Similar News