Mahesh Kumar Goud : కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తాం : మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. వారికి పార్టీలో తగిన గౌరవం దక్కేలా.. పదవులు కల్పిస్తామని తెలియ జేశారు. బీఆర్ఎస్(BRS) పాలనపై ప్రజలు విసిగి పోయారని, అందుకే తమకు అధికారం అప్పగించారని మహేష్ గౌడ్ తెలిపారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, ఏడాది పాలనపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేటీఆర్(KTR) తప్పు చేశాడు కాబట్టే జైలుకు పోతానని అంటున్నాడని.. తప్పు చేశామని తెలుసు గనుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారని, అప్పులపాలు చేశారని మండి పడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలాంలోనే ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు చేస్తుంటే జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని తెలియ జేశారు. బీఆర్ఎస్, బీజేపీ(BJP) రెండు పార్టీలు ఒకటేనని, ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.