Jeevan Reddy: కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Update: 2025-01-09 12:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసందర్భం ప్రేలాపణలు మానుకుని సీఎం హోదాను, పదవిని గౌరవించడం నేర్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) ఫైర్ అయ్యారు. పదేళ్లు మంత్రిగా పని చేసిన వ్యక్తి లొట్టపీసు కేసు అని మాట్లాడవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఆయన తండ్రి కేసీఆర్ (KCR) నేర్పించిన సంస్కారం, సంస్కృతి అని మండిపడ్డారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి అని నిలదీశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేటీఆర్ (KTR) స్వప్రయోజనం ఏంటో తెలుసుకునేందుకే ఫార్ములా -ఈ కార్ రేసు (Formula E Car Race) ను ఏసీబీ విచారిస్తోందన్నారు. గవర్నర్ అనుమతితో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. గవర్నర్ అనుమతి ఆషామాషీగా రాదు. న్యాయకోవిధులతో చర్చించాకే గవర్నర్ అనుమతి ఇస్తారు. అలాంటి కేసుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఓ వైపు ఏ విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని చెబుతునే మరోవైపు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇందులో నిజంగా తప్పు చేయకపోతే నీ నిర్దోషితత్వం బయటపడుతుంది. ఆ అవకాశం ఉపయోగించుకోకుండా అసహనం కోల్పోయి మాట్లాడటం ఏంటని దుయ్యబట్టారు. అధికారం పోయిందని, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీఎం అయ్యారని ఈర్ష్య, ద్వేషం ఉంటే దాన్ని వెలిబుచ్చే పద్దది ఇది కాదన్నారు. కేటీఆర్ భాష, తన తీరు మార్చుకోవాలన్నారు.

Tags:    

Similar News