ఆయనని వ్యవసాయ శాఖ మంత్రిని చేసే బాధ్యత నాదే!.. రేవంత్ రెడ్డి హామీ
నిజామాబాద్ ప్రజలు జీవన్ రెడ్డి ని గెలిపిస్తే ఆయన్ని కేంద్రంలో వ్యవసాయ శాఖమంత్రిని బాధ్యత నాదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ ప్రజలు జీవన్ రెడ్డి ని గెలిపిస్తే ఆయన్ని కేంద్రంలో వ్యవసాయ శాఖమంత్రిని బాధ్యత నాదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు నిజామాబాద్ అంటే ప్రత్యేక అభిమానం అని అన్నారు. నిజమాబాద్ లో గెలిచి పార్లమెంట్ లో మాట్లాడాలి. ఈ ప్రాంతంలో పసుసు బోర్డును, చెక్కర కర్మాగారాన్ని తెలిపించాలని, ఈ ప్రాంత రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ది పథంవైపు నడిపించాలని జీవన్ రెడ్డి తనతో చెప్పాడన్నారు.
అయితే రాబోయే రోజుల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, జీవన్ రెడ్డి గారిని కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసే బాధ్యత నాదేనని మాట ఇస్తున్నానన్నారు. జైపాల్ రెడ్డి గారు, పీవీ నర్సింహరావు గారు ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉండి వారి పదవులకే వన్నె తెచ్చారని, ఈ ప్రాంతానికి, దేశానికి గౌరవం తీసుకొచ్చారని, ఆ స్థాయిలో గౌరవం ఉన్నవాళ్లు, సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, రైతాంగాన్ని ఆదుకోవాలనే తపన ఉన్నవాళ్లు, ప్రజలకే అంకితం అయిన వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది జీవన్ రెడ్డే అని కొనియాడారు. అందుకే మీరు నిజమాబాద్ లో జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలను ఒప్పించి వ్యవసాయశాఖ మంత్రి పదవి తీసుకొస్తానని రేవంత్ రెడ్డి అన్నారు.
Read More...
BREAKING: పడిపోతున్న నన్ను నిలబెట్టింది మల్కాజ్‌గిరి ప్రజలే: సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ కామెంట్స్