టీఎస్‌పీఎస్‌సీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.

Update: 2024-01-12 13:59 GMT
టీఎస్‌పీఎస్‌సీలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in లో అందుబాటులో ఉంచింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్‌లో పేర్కొంది. అర్హులైన వారు తేదీ.18.01.2024 సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్-లైన్, ఈ-మెయిల్ secy-ser-gad@telangana.gov.in ద్వారా అందచేయాలని తెలిపారు. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News