ఆరేళ్ల చిన్నారిని రేపిస్ట్ నుండి కాపాడిన ర్యాపిడో డ్రైవర్ ఫస్ట్ రియాక్షన్ (వీడియో)

ఆరేళ్ల చిన్నారిపై కామాంధులు అత్యాచార యత్నం చేయగా.. ర్యాపిడో డ్రైవర్ కాపాడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్.. నంద్యాలకు చెందిన కారంతోట్ కళ్యాణ్ (26) మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.

Update: 2023-05-12 06:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్ల చిన్నారిపై కామాంధులు అత్యాచార యత్నం చేయగా.. ర్యాపిడో డ్రైవర్ కాపాడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్.. నంద్యాలకు చెందిన కారంతోట్ కళ్యాణ్ (26) మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాలని ఇటీవల హైదరాబాద్‌లో కోచింగ్ కోసం వచ్చాడు. పార్ట్ టైమ్ జాబ్‌గా ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు ర్యాపిడో బుక్ చేయగా.. అతన్ని పికప్ చేయసుకోవడానికి పంజాగుట్ట సమీపంలోని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లాడు. ప్రయాణికుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో పక్కన పొదల నుంచి ఓ బాలిక అరుపులు వినిపించాయి.

వెంటనే అటుగా వెళ్లి చూశాడు. ఓ 20 ఏళ్లు యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేయడాన్ని చూసి షాకై అతన్ని అడ్డుకున్నాడు. అనంతరం అతన్ని నిలదీయగా ఆ యువకుడు బాలిక తండ్రిని అంటూ బుకాయించాడు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందజేయగా.. సదరు నిందితుడ్ని అరెస్ట్ చేసి, చిన్నారిని కాపాడిన ర్యాపిడో డ్రైవర్ కల్యాణ్‌ను అభినందించారు. తాజాగా.. కల్యాణ్‌ను ‘దిశ’ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఆరోజు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నించగా.. కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Tags:    

Similar News