Amit Shah: కేంద్ర హోంమంత్రిపై హైదరాబాద్ లో ఫిర్యాదు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పై హైదరాబాద్(Hyderabad) లో ఫిర్యాదు(complaint) నమోదు అయ్యింది.

Update: 2024-12-21 02:44 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పై హైదరాబాద్(Hyderabad) లో ఫిర్యాదు(complaint) నమోదు అయ్యింది. లోక్ సభ(Lok Sabha) సాక్షిగా డా. బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) ను అవమానించారని హైదరాబాద్ కు చెందిన కార్తీక్ అనే న్యాయవాది తెలంగాణ డీజీపీ(Telangana DGP)కి లేఖ రాశారు. పార్లమెంట్‌లో అంబేద్కర్ పేరును అమర్యాదగా ఉచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అవుతోందని, అంబేద్కర్ పేరుకు బదులుగా భగవాన్ పేరు జపం చేస్తే ఏడు జన్మలకు స్వర్గం లభిస్తుందని అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అయితే అమిత్ షా ప్రసంగం ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరును దుర్వినియోగం చేసిందని చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఆయన ప్రస్తావించిన విధానం అభ్యంతరకరంగా, అగౌరవంగా ఉందని, ఇది భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 352 తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి(SC and ST Atrocities) సమానం అవుతుందని తెలిపారు. కావున అమిత్ షా S/o అనిల్‌చంద్ర షాపై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసి, విచారణ జరిపి, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాది కార్తీక్(lawyer Karthik) ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News