Protest: ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. టవర్ ఎక్కి మాజీ హోంగార్డు హల్‌చల్
నగరంలోని ఎల్బీ స్టేడియం (LB Stadium) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని ఎల్బీ స్టేడియం (LB Stadium) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డు (Former Home Guard) వీరాంజనేయులు (Veeranjaneyulu) హల్‌చల్ సృష్టించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తించిన తనతో పాటు మరో 250 మంది హోంగార్డులను ఉద్యమంలో పాల్గొన్నారంటూ అప్పటి ప్రభుత్వం కక్షగట్టి విధుల నుంచి తొలగించిందని పేర్కొన్నాడు. విధులు నిర్వర్తించినట్లుగా తమ వద్ద సర్టిఫికెట్లు (Certificates), బాంక్ అకౌంట్లు (Bank Accounts), హెల్త్ కార్డులు (Health Cards) కూడా ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి రాగానే తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారని.. సంవత్సరం గడుస్తున్నా ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నట్లుగా వీరాంజనేయులు తెలిపాడు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి 250 మంది హోంగార్డను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అతడు వేడుకుంటున్నాడు.