Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎర్రారం (Yerraram) గ్రామానికి చెందిన మహమ్మద్ హాజీ, నబీనా, అబ్దుల్ ఖాదర్ దేవరకొండ (Devarkonda) పట్టణంలోని ఓ దర్గా వద్ద కూర్చుకున్నారు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన ఓ డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.