Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని శ్రీసత్యసాయి (Sri Satyasai) జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని శ్రీసత్యసాయి (Sri Satyasai) జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమరాపురం (Amarapuram) మండల పరిధిలోని గుడిబండ (Gudibanda) గ్రామానికి చెందిన 14 మంది టెంపోలో తిరుమల (Tirumala)కు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర (Madakashira) మండల పరిధిలోని బుళ్లసుముద్రం (Bulla Samudram) సమీపంలో వారు ఆగి ఉన్న టెంపోను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.