Fire Accident: నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎగిసిపడుతోన్న మంటలు
భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) సంభవించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని మాదాపూర్ (Madhapur)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) సంభవించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ భవనంలోని 5వ అంతస్తులో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి వేళ అక్కడ ఎవరూ లేకపోవడంతో అర్ధరాత్రి నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల బిల్డింగ్‌లకు కూడా ఆ మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.