మెహిదీపట్నంలో.. జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో రెండవ రోజు కూల్చివేతలు!

అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసి అధికారులు కొరడా ఝుళిపించారు.రెండవ రోజు కూల్చివేతలు చేపట్టారు.

Update: 2024-09-05 17:06 GMT

దిశ, కార్వాన్: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసి అధికారులు కొరడా ఝుళిపించారు.రెండవ రోజు కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని జీహెచ్ఎంసి సర్కిల్-12 టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి హెచ్చరించారు.గురువారం మెహిదీపట్నం నవోదయ కాలనీలో జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. స్టీల్ ప్లస్ 3 అనుమతులు తీసుకొని, బహుళ అంతస్తులు నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆ అంతస్తులను కూల్చి వేయడం జరిగిందని ఏసిపి పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే భవనాలను అనుమతులు తీసుకొని భవనాలను నిర్మించాలని లేనిపక్షంలో కూల్చివేతలు తప్పవని ఏసిపి మరోసారి హెచ్చరించారు.

కాగా ఈ ప్రాంతంలో కూడా స్టీల్ ప్లస్ త్రీ అనుమతులు తీసుకొని బహుళ అంతస్తులు నిర్మించారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వారు ఆరోపించారు. త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఏసిపి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో సెక్షన్ అధికారి నర్సింగరావు తో పాటు జిహెచ్ఎంసి సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.


Similar News