CM Revanth: సమయం వృథా చేయకుండా వెంటనే ప్రారంభించాం

హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ఐఐహెచ్‌టీని ఘనంగా ప్రారంభించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు.

Update: 2024-09-09 08:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ఐఐహెచ్‌టీని ఘనంగా ప్రారంభించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐహెచ్‌టీ విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం ఇస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణకు ఐఐహెచ్‌టీ తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రధాని మోడీతో పాటు అనేకమంది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.

తాము కోరిన వెంటనే తెలంగాణకు ఐఐహెచ్‌టీ మంజూరు చేశారని తెలిపారు. తాము కూడా సమయం వృథా చేయకుండా వెంటనే ప్రారంభించామని అన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చారు.. కానీ, బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. తాము వచ్చిన వెంటనే కార్మికులకు బకాయిలు చెల్లించామని వెల్లడించారు. గత ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పరిమితం అయింది తప్పా.. నేతన్నలకు ఏనాడూ ఆడుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేతన్నలకు తాము రూ.30 కోట్ల రుణమాఫీ చేస్తామని అన్నారు.


Similar News