ఏకంగా సీఎం రాజ్ భవన్ ముట్టడికి వెళితే.. లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
నేడు టీపీసీసీ(TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజ్ భవన్(Raj Bhavan) ముట్టడికి పిలుపునిచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: నేడు టీపీసీసీ(TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజ్ భవన్(Raj Bhavan) ముట్టడికి పిలుపునిచ్చారు. అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. చేస్తున్న ఈ పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గోననున్నారు. రేవంత్ రెడ్డి.. రాజ్ భవన్ ముట్టడిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(BJP MLA Payal Shankar) మండిపడ్డారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. గవర్నర్(Governor) నిలయాన్ని ముట్టడి చేస్తే.. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పరిపాలన చేసేవాళ్లు రాజ్ భవన్ ముట్టడికి వెళ్తారా.. ఈ వ్యవహారంపై సీఎం మరోసారి పునరాలోచించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.