మంత్రి కోమటిరెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు సభ ప్రారంభం అయిన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మానంపై హారీశ్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Update: 2024-12-18 06:07 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు సభ ప్రారంభం అయిన కొద్ది సేపటికే గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్ల నిర్మానంపై హారీశ్ రావు(Harish Rao), మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మామ చాటు అల్లుడిగా హరీష్ రావు 10 వేల కోట్లు సంపాదించుకున్నాడని.. కాళేశ్వర్యంలో కమిషన్లు తీసుకున్నట్లు తాను నిరూపిస్తానని మంత్రి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తాను కమిషన్లు తీసుకున్నట్లు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసెంబ్లీకి కొందరు తాగి వస్తున్నట్లున్నారు. అలాంటి వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని.. మంత్రి కొమటిరెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా దుమారం గా మారింది. హరీష్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో సభలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించినట్లు అసెంబ్లీ స్పీకర్(Speaker of the Assembly) ప్రకటించారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను తొలగించడానికి పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించారు.


Similar News