అసెంబ్లీలో భూ భారతి బిల్లు.. హరీష్ రావు కీలక రిక్వెస్ట్
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి భూ భారతి 2024 బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం వెంటన్ రూల్స్ సస్పెండ్ చేసిన స్పీకర్ భూభారత బిల్లుపై చర్చ ప్రారంభించారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి భూ భారతి 2024 బిల్లు(Bhu Bharati Bill)ను ప్రవేశ పెట్టారు. అనంతరం వెంటన్ రూల్స్ సస్పెండ్ చేసి భూ భారతి బిల్లుపై చర్చ ప్రారంభించారు. కాగా ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు(Former minister Harish Rao).. బిల్లుకు సంబంధించిన కాపీలు కూడా అందించకుండా ఎలా చర్చించాలని స్పీకర్ ను ప్రశ్నించారు. అలాగే బీఏసీ మీటింగ్(BAC meeting)లో సభ నిర్వాహన సమయానికి సంబంధించిన వివరాలను అందించలేదని, సభలో ఏ ఏ బిల్లులను ప్రవేశ పెట్టబొతున్నారో ముందస్తుగా తెలపలేదని, కాంగ్రెస్ సభ్యులకు ఇష్టం వచ్చినప్పుడు బిల్లును పెట్టి రూల్స్ ను సస్పెండ్ చేసి.. బిల్లు ప్రవేశ పెట్టిన వెంటనే చర్చించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఈ రోజు సభలో పెట్టిన బిల్లుపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని.. తాము కూడా బిల్లును పూర్తిగా చదివి.. తమ వంతు సలహాలు సూచనలు ఇస్తామని ఇందుకు ప్రతి సభ్యునికి సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా హరీష్ రావు స్పీకర్ ను కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఈ బిల్లు వివరాలను మంత్రి వివరించిన తర్వాత.. బ్రేక్ ఇచ్చి.. ఆ తర్వాత బిల్లుపై చర్చిద్దామని స్పీకర్ కు చెప్పుకొచ్చారు.