Dil Raju : తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (Telangana Film Development Corporation Chairman)గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్ డీసీ(TFDC )కాంప్లెక్స్ లోని కార్యాలయంలో బుధవారం నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (Telangana Film Development Corporation Chairman)గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్ డీసీ(TFDC)కాంప్లెక్స్ లోని కార్యాలయంలో బుధవారం నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. ఇవాళ డిసెంబర్ 18న దిల్ రాజు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హాజరై దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. దిల్ రాజు సారథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, ప్రపంచ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ ' టీఎఫ్ డీసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలని అందుకు అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని, తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చిందన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఏంతో అభివృద్ధి చెందిందని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలన్నారు. టీఎఫ్ డీసీ చైర్మన్ గా నాపై చాలా బాధ్యత ఉందని, ఫిల్మ్ ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని, సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.