Minister Ponguleti: తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) భూభారతి బిల్లు(Bhu Bharathi Bill)ను ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) భూభారతి బిల్లు(Bhu Bharathi Bill)ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని అన్నారు. ధరణి పోర్టల్(Dharani Portal) వల్ల లక్షలాది సమస్యలు వచ్చాయని, రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం అవ్వాల్సినవి కూడా కోర్టులకు చేరాయని గుర్తుచేశారు. భూయజమానికి తెలియకుండానే భూములు తారుమారు అయ్యాయని, పేదలు తమ ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయిందని తెలిపారు. లోపభూయిష్టమైన ఆర్వోఆర్ చట్టం-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్తగా భూభారతి చట్టాన్ని తెచ్చామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్(Congress) అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో ఇష్టారాజ్యంగా దోచుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. గత ప్రభుత్వం ధరణిని తమ ఇంటి సంస్థగా వాడుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూభారతి చట్టం రూపకల్పనలో బీఆర్ఎస్(BRS) కీలక నేతలైన హరీష్‌రావు(Harish Rao), వినోద్(Vinod) లాంటి వాళ్ల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేశామని కీలక వ్యాఖ్యలు చేశారు.