Minister Seethakka : ఉచిత బస్సు స్కీమ్ కు వ్యతిరేకంగానే బీఆర్ఎస్ డ్రామాలు : మంత్రి సీతక్క

మహిళలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు స్కీమ్ (Free Bus)కు వ్యతిరేకంగానే ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్(BRS) డ్రామాలేస్తుందని మంత్రి సీతక్క(Minister Seethakka)విమర్శించారు.

Update: 2024-12-18 06:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బస్సు స్కీమ్ (Free Bus)కు వ్యతిరేకంగానే ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్(BRS) డ్రామాలేస్తుందని మంత్రి సీతక్క(Minister Seethakka)విమర్శించారు. పేదింటి మహిళలు ఎక్కే ఉచిత బస్సులు వద్దా బీఆర్ఎస్ చెప్పాలన్నారు. బైక్ డ్రాపింగ్ సర్వీస్ లను, ఓలా, ఉబర్ వంటి వాటిని మీరే ప్రోత్సహించారన్నారు. ఆటోలకు మీరు పదేళ్లలో ఏం చేశారంటూ బీఆర్ఎస్ సభ్యులపై మండిపడ్డారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకంపై బీఆర్ఎస్ సభ్యులు వివేకాంద, రాజశేఖర్ రెడ్డి ,బల్లాలలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 244కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని.. 2024-25నాటికి 140కోట్ల 74లక్షల బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు.

మార్చి వరకు సమయముున్నప్పటికి డిసెంబర్ నెలాఖరుకల్లా పెండింగ్ లో ఉన్న 104కోట్లు క్లియర్ చేస్తామన్నారు. మరింత సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. కొత్తగా అంబేద్కర్ ఓవర్సీస్ కింద 3,488దరఖాస్తులు రాగా, 1310మంది విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. స్కాలర్ షిపులు, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి లావణ్య బీఆర్ఎస్ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మీరు పెట్టిన 4,500కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి చెల్లింపులకు చర్యలు తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

Tags:    

Similar News