Tg News: బాలుడి ఆచూకీ తెలిపిన ఆధార్ ఫోన్ నెంబర్

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ వివరాలు కనిపెట్టడం జరుగుతుందని ఉమెన్ సెఫ్టీ డీజీ శిఖా గోయాల్ తెలిపారు....

Update: 2024-12-04 16:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల ట్రేసింగ్ వివరాలు కనిపెట్టడం జరుగుతుందని ఉమెన్ సెఫ్టీ డీజీ శిఖా గోయాల్ తెలిపారు. 2014లో తప్పిపోయిన బాలుడి జాడ కనిపెట్టినట్లు తెలిపారు. ఇందుకు సబంధించిన వివరాలు బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పీఎస్ కంచన్‌బాగ్‌లో క్రైమ్ నంబర్ 190/2014 యు/హెడ్ బాయ్ మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలిపారు.

మహ్మద్ అర్షద్ ఘోరి అనే వ్యక్తీ కుమారుడు మహ్మద్ ఖలీల్ ఘోరి 12 సంవత్సరాల బాలుడు హైదరాబాద్‌లో 18 ఆగస్టు2014 నుండి ఇంటీ నుండి తప్పిపోయినట్లు తెలిపారు. ఆ బాలుడు కేవలం ఆధార్ కార్డుతోనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో గుర్తించామన్నారు. తప్పిపోయిన బాలుడి ఆధార్ కార్డు ద్వారా అతని డిజిటల్ ఐడెంటిటీ మార్చబడి, కొత్త మొబైల్ నంబర్‌తో అప్‌డేట్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. మొబైల్ నంబర్ వివరాలను బట్టి విచారణ చేయగా ప్రయాగ్‌రాజ్ రాష్ట్రం (యుపి రాష్ట్రం) వద్ద కాన్పూర్ ఉద్యోగిదని వెల్లడైందన్నారు. 12 సంవత్సరాల వయస్సులో బాలుడు రైలులో యుపికి వెళ్లాడని, కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్నప్పుడు రైల్వే పోలీసు కాన్పూర్ వారు చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌కు తీసుకెళ్లారని 2022 వరకు అక్కడ ఉన్నట్లు తెలిపారు. అక్కడ నుండి అతనిని ఒక ప్రభుత్వ ఉద్యోగి దత్తత తీసుకున్నాడని, ప్రస్తుతం అతని వయస్సు 22 సంవత్సరాలు గుర్తించమన్నారు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న రెండు మిస్సింగ్ కేసులను ప్రత్యేక బృందం గుర్తించిందని వాటి వివరాలు వెల్లడించారు.

క్రైమ్ నం. 325/2015 తెలంగాణ రాచకొండ కమిషనరేట్‌కు చెందిన పిఎస్ నాచారం యు/హెడ్ గర్ల్ తప్పిపోయిందని ఫిర్యాదు నమోదైందన్నారు. నాచారంలోని శాంతి సదన్ హోమ్‌లో దాదాపు 11 సంవత్సరాల వయస్సు గల గంగ అలియాస్ గంగామణి అనే బాలిక తప్పిపోయింది. 9 సంవత్సరాల తర్వాత నిజామాబాద్‌లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా గుర్తించబడిందన్నారు . తప్పిపోయిన బాలిక బెలూన్ విక్రేత అని చిన్న ఆధారం ఆధారంగా బాలికను కనుగొనమన్నారు. నిజామాబాద్‌ టౌన్‌లో తన భర్తతో కలిసి బెలూన్లు విక్రయిస్తుండగా ఆ బాలిక ఆచూకీ లభించిందన్నారు. ఆమె సైబాతరు అనే వ్యక్తిని పెళ్లాడిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, గత 4 సంవత్సరాలుగా నిజామాబాద్‌ టౌన్‌లో నివాసముంటున్నారని తెలిపారు.

క్రైమ్ నం. 168/2017 యూ/ఎస్ఈసీ పీసి చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ కమిషనరేట్ 363 ఐపిసి, కేసులో ఇద్దరు మైనర్‌లు తప్పిపోయరన్నారు. చంద్రాయణ గుట్టకు చెందిన సుమారు 10 సంవత్సరాల వయస్సు గల బాలిక సుమారు 8 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి 2017లో తప్పిపోయారు. 7 సంవత్సరాల తర్వాత కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఎహెచ్ఈ సైబర్ బృందం ద్వారా కనుగొనబడిందన్నారు. నవంబర్ 2024 వరకు తెలంగాణలో 22,780 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 19,191 కేసులు ఇప్పటికే చేందించమని తెలిపారు. తెలంగాణ ట్రేసింగ్ శాతం 84.25%, జాతీయ సగటు 51.1% అని తెలిపారు. ఉమెన్ ప్రోటెక్షన్ ఫోర్స్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 27 కేసులను గుర్తించిందన్నారు. మహిళా సేఫ్టీ వింగ్‌లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ , సైబర్ ల్యాబ్ అధికారుల కృషిని డిజీ శిఖా గోయాల్ ప్రత్యేకంగా అభినందించారు.


Similar News