మందు బాబులకు బిగ్ షాక్.. ఆ ఏరియాలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్..!

హైదరాబాద్ కమిషనరేట్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఎస్‌ఆర్ నగర్ పీఎస్

Update: 2024-07-06 17:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కమిషనరేట్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఎస్‌ఆర్ నగర్ పీఎస్ లిమిట్స్‌లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవంతో పాటు బోనాల పండుగ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మొత్తం 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవంతో పాటు బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేసి సహకరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Similar News