Traffic Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేడు ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్), తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ పోటీలు గచ్చిబౌలి స్టేడియం ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3, 6, 9 తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో టాఫ్రిక్ ఆంక్షలు విధించనట్లుగా ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని జీపీఆర్ఏ క్వార్టర్స్, గోపీచందర్ అకాడమీ, ఇన్ఫోసిస్, విప్రో జంక్షన్ మీదుగా గోపన్‌పల్లి నుంచి లింగంపల్లికి వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా లింగంపల్లి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కు వచ్చే వాహనదారులు హచ్‌సీయూ డిపో, మసీద్ బండ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలికి రాకపోకలు సాగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.