బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న పోకిరీల అరెస్ట్..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పోకిరీలు తమ తీరు మార్చుకోవడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఐటీ కారిడార్ లో బైక్ లతో రెచ్చిపోతున్నారు.

Update: 2024-10-26 16:49 GMT

దిశ, శేరిలింగంపల్లి: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పోకిరీలు తమ తీరు మార్చుకోవడం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఐటీ కారిడార్ లో బైక్ లతో రెచ్చిపోతున్నారు. పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి మాదాపూర్ ఐటీ కారిడార్ కు వచ్చి మరీ బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్నారు. ఇటీవల పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసినా తీరు మార్చుకోవడం లేదు. తాజాగా శుక్రవారం రాత్రి బైక్ రేసింగ్ లకు పాల్పడిన 30 మంది యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూటీలతో పాటు అత్యంత ఖరీదైన బైకులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వీకెండ్ కావడంతో ఐకీయా, టీ హబ్ ప్రాంతాల్లో బైక్ లతో రేసింగ్ లు చేస్తూ విన్యాసాలు చేస్తునట్టు పోలీసులు గుర్తించారు. బైక్ లతో పాటు, స్కూటీ లతో రేసింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. విపరీత శబ్దం తో, వాయు వేగంతో, బైక్ లతో దూసుకుపోతున్న పోకిరీలతో ఆవైపుగా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు మందలించినా పోకిరీల తీరు మారడం లేదు. రేసింగ్ లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.


Similar News