జాతీయ స్థాయిలో AMB Cinemas ప్రత్యేక గుర్తింపు.. టాప్ మల్టిప్లెక్స్‌లలో చోటు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత థియేటర్ AMB Cinemas మరో ఘనత సాధించింది.

Update: 2024-09-14 15:07 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత థియేటర్ AMB Cinemas మరో ఘనత సాధించింది. దేశంలో అత్యధికంగా ప్రతిరోజు.. ఎక్కువ మంది ప్రజలు సందర్శించే మాల్స్ నివేదికను GeoIQ ఇచ్చింది. కాగా ఈ నివేదికలో హైదరాబాద్‌కు చెందిన శరత్ సిటీ కాపిటల్ మాల్ జాతీయ స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. ఈ మాల్ లోని మహేష్ బాబుకు చెందిన AMB Cinemas థియేటర్ కూడా ఉంది. శరత్ సిటీ కాపిటల్ మాల్‌కు అత్యధికంగా AMB సినిమాస్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు, సినీ అభిమానులు సందర్శిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోనే టాప్ సినిమా మల్టిప్లెక్స్‌లలో AMB Cinemas మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తుంది.


Similar News