వోల్వో షోరూంలో రూ.50 లక్షల మోసం..
వోల్వో షోరూంలో రూ. 50 లక్షల మోసానికి పాల్పడిన మేనేజర్ తో పాటు మరో ఐదు మందిని లంగర్ హౌస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు
దిశ, కార్వాన్ : వోల్వో షోరూంలో రూ. 50 లక్షల మోసానికి పాల్పడిన మేనేజర్ తో పాటు మరో ఐదు మందిని లంగర్ హౌస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ రఘు కుమార్, ఎస్ఐ దీపిక కథనం ప్రకారం.. రింగు రోడ్డులో పిల్లర్ నంబర్ 92 వద్ద వోల్వో షోరూం ఉంది. వీరు పాత వాహనాలను కొని విక్రయిస్తుంటారు. సికింద్రాబాద్ కు చెందిన మహేష్ ఈ షోరూంతో పాటు ఎల్బీనగర్ షోరూంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇతడు తక్కువ ధరకు వాహనాలు కొని రికార్డుల్లో ఎక్కువ ధర చూపిస్తుంటాడు. ఇలా సంస్థకు రూ.50 లక్షల మేర నష్టం కలిగించడంతో సీఈఓ కృష్ణప్రసాద్ ఫిర్యాదు మేరకు మహేష్ తో పాటు అతడికి సహకరించిన మరో ఐదుగురిపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.