బహిరంగంగా మద్యం సేవించడం నిషేధం : సీపీ సుధీర్ బాబు
బహిరంగంగా మద్యం సేవిస్తే ఇక సెక్షన్ 188 కింద చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.
దిశ, సిటీక్రైం : బహిరంగంగా మద్యం సేవిస్తే ఇక సెక్షన్ 188 కింద చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు బహిరంగంగా మద్యం సేవించడాన్ని నిషేధించారు. బహిరంగ మద్యం సేవిస్తున్న ప్రాంతాల పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను చేపట్టనున్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందుబాబు ప్రవర్తన అసభ్యంగా, భయాందోళన కలిగించే విధంగా ఉంటుందనే విషయం పోలీసులకు ఇటీవల చాలా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని బహిరంగంగా మద్యం సేవించి కలవరం రేపే విధంగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.