High Court : ఆ దాబాలకు హైకోర్ట్ షాక్

దాబాలకు హైకోర్ట్(High Court) షాకిచ్చింది.

Update: 2025-03-06 13:07 GMT
High Court : ఆ దాబాలకు హైకోర్ట్ షాక్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : దాబాలకు హైకోర్ట్(High Court) షాకిచ్చింది. హైదరాబాద్(Hyderabad) లోని పలు దాబాల బోర్డులు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నగరంలో శాఖాహార ప్రియులు ఎక్కువగా కోరుకునే సంతోష్ దాబా(Santhosh Daba)లు వందల్లో ఉంటాయి. అయితే ఆ సంస్థకు చెందిన బ్రాంచీలు కాదు. ఎవరికి వారు తమ శాఖాహార రెస్టారెంట్ కు పెట్టుకున్న బోర్డులు అవి. అయితే వీటిపై అసలైన సంతోష్ దాబా యజమాని సునీల్ కోర్టుకు ఎక్కారు. తమ అనుమతి లేకుండా నగరంలో వెలసిన సంతోష్ దాబాల పేర్లను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తక్షణమే సంతోష్ దాబా పేరుతో ఉన్న 200కు పైగా రెస్టారెంట్స్ బోర్డ్స్ తొలగించాలని జీహెచ్ఎంసీ(GHMC) అధికారులకు ఆదేశాలకు జారీ చేసింది. దీంతో రేపో మాపో ఆయా బోర్డులన్నిటినీ తొలగించనున్నారు.  

Tags:    

Similar News