సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు.. ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ కీలక విజ్ఞప్తి

సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ కు సంబంధించి ఫ్యాన్స్ కు హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు..

Update: 2024-12-22 10:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ‘పుష్పా-2’ మూవీ(Pushpa-2 movie) రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ (Sandya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో తల్లి రేవతి మృతి చెందగా కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సంధ్య థియేటర్ యజమానులతో పాటు హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో హీరో అల్లు అర్జున్ ముందస్తు బెయిల్‌పై జైలు నుంచి విడుదల అయ్యారు.

అయితే పుష్పా-2, హీరో అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ తప్పిదం ఉన్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే సినీ ప్రముఖులు పరామర్శించారని, కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎవరూ పరామర్శించలేదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హీరో అల్లు అర్జున్.. తొక్కిసలాట ఘటన బాధాకరమని, బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నానని తెలిపారు. కానీ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్(Bunny fans) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఫ్యాన్స్ కీలక విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరినీ కించపర్చేలా పోస్టు పెట్టొద్దని తెలిపారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు పెడుతున్నారని చెప్పారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండాలని అభిమానులకు హీరో అల్లు అర్జున్ తెలిపారు.

Read More : OU JAC : అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ..రాళ్లతో దాడి

CP CV Anand : సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వీడియో బయట పెట్టిన పోలీసులు

Tags:    

Similar News