హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం

హైదరాబాద్(Hyderabad) నగరాన్ని ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది.

Update: 2024-10-06 11:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరాన్ని ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షం ధాటికి రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా కూకట్ పల్లి, జీడిమెట్ల, సూరారం, మేడ్చల్ లో భారీ వర్షం కురిసింది. కాగా ఆదివారం రాత్రి మరోసారి నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురవనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.


Similar News