Bela Mutyalamma temple : బేలా ముత్యాలమ్మ దేవాలయంలో ఘనంగా చప్పన్‌భోగ్..
ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా బేలా శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో శుక్రవారం చప్పన్ భోగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
దిశ, చార్మినార్ : ఆషాడమాసం బోనాల ఉత్సవాలలో భాగంగా బేలా శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో శుక్రవారం చప్పన్ భోగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పొటేల్ కృష్ణయాదవ్, ఆలయ అధ్యక్షుడు పొటేల్ సదానంద్ యాదవ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్దపెట్టున సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. చప్పన్ భోగ్ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి 56 రకాల స్వీట్లతో పాటు 13 రకాల డ్రై ఫ్రూట్స్, 12 రకాల పండ్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.