ఖానామెట్ మీనాక్షి టవర్స్ లో అగ్నిప్రమాదం
మాదాపూర్ లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానామెట్
దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానామెట్ లో గల మీనాక్షి టవర్స్ 15వ అంతస్థులోని ఓ ఇంటిలో షాట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్ లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.