ముంబైకి రైలును భువనగిరి, ఆలేరు, జనగామలో నిలిపేలా కృషి : బీర్ల ఐలయ్య
ముంబైకి వెళ్లే రైలును భువనగిరి, ఆలేరు, జనగామ స్టేషన్లలో నిలిపేలా అధికారులతో మాట్లాడతానని, కురుమ సంఘం ముంబై వారికి అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు
దిశ, హిమాయత్ నగర్ : ముంబైకి వెళ్లే రైలును భువనగిరి, ఆలేరు, జనగామ స్టేషన్లలో నిలిపేలా అధికారులతో మాట్లాడతానని, కురుమ సంఘం ముంబై వారికి అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో కురుమ సంఘం ముంబై-2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ… ఇక్కడ నివాసం ఉంటున్న వారంతా ఆలేరు, జనగామ పరిసర ప్రాంతాల వారని వారికి ముంబైకి వచ్చిపోయేందుకు గాను రైలును భువనగిరి, ఆలేరు, జనగామ రైల్వే స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని వారి కోరిక మేరకు రైల్వే మంత్రితో మాట్లాడి ఆయా రైల్వేస్టేషన్లో ముంబై రైలు నిలిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంగ సత్యనారాయణ, కర్రే జహంగీర్, పుప్పాల సత్తయ్య, జట్ట కృష్ణ, కుండే చంద్రయ్య, జూకంటి రామ్ చందర్, గవ్వల శ్రీనివాస్, కెమిడి అనిల్, ఐల చంద్రమౌళి, మోటె సిద్దులు, కంచర్ల గణేష్, మలగ వెంకటేష్, గాదరి మల్లేష్, పుప్పాల చిన్న సత్తయ్య, నోముల రమేష్, బంటు శ్రీనివాస్ పాల్గొన్నారు.