జన్యుమార్పిడి విత్తనాలు వాడొద్దు

ప్రపంచంలో మానవ మనుగడకు రైతే మూలాధారమని, రైతు లేనిది ఏదీ సాధ్యం కాదని రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు దోమ మోహన్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-29 14:15 GMT

దిశ, తలకొండపల్లి : జన్యుమార్పిడి విత్తనాలు వాడొద్దని కిసాన్ సెల్ నాయకులు సూచించారు. ప్రపంచంలో మానవ మనుగడకు రైతే మూలాధారమని, రైతు లేనిది ఏదీ సాధ్యం కాదని రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు దోమ మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్కా భవన్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన కిసాన్ సెల్ ప్రధాన నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది రైతులు తెలిసీతెలియక జన్యు మార్పిడి విత్తనాలను వాడుతున్నారని, వాటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. జన్యుమార్పిడి విత్తనాలకు రాష్ట్ర కిసాన్ సెల్ వ్యతిరేకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అఖిల భారత కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆయా రాష్ట్రాల కిసాన్ సెల్ నాయకులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News