బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలను, చెత్తను కాల్చవద్దు…

గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాలలో చెత్తను, వ్యర్ధాలను కాల్చవద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజలను కోరారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ కాలుష్య

Update: 2025-01-02 16:06 GMT

దిశ, ఖైరతాబాద్ : గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాలలో చెత్తను, వ్యర్ధాలను కాల్చవద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజలను కోరారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వాయు కాలుష్యానికి ముఖ్యమైన కారకమని దీని ద్వారా వచ్చే హానికరమైన ఉద్గారాలు గాలి నాణ్యతను దిగజార్చడమే కాకుండా గుండె జబ్బులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ప్రజలకు కలిగిస్తాయని అన్నారు. చెత్తను కాల్చడం చట్టరీత్యా నేరమని అంతేకాకుండా చెత్త కాల్ చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పి.సురేష్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కె.సాయి దివ్య, మీడియా కోఆర్డినేటర్ ఎ. సోమేష్ కుమార్, పి.నాగరాణి, జి.వెంకటేష్ పాల్గొన్నారు.


Similar News